సీసీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

AKP: రాంబిల్లి మండలం మామిడివాడ కొత్తూరు ఎస్సీ కాలనీలో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం పరిశీలించారు. నియోజకవర్గంలో మౌలిక వసతి సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.