VIDEO: గోడ కూలి మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు

VSP: మధురవాడ 5వ వార్డ్ వికలాంగుల కాలనీలో ఇంటి గోడ కూలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు మట్టిలో కూరుకుపోయిన ఇద్దరిని బయటకు తీసారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గత 4రోజులుగా పడుతున్న వర్షాలకు గోడ తడవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.