ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు: సైదులు
SRPT: ఉపాధిని హరించే 'జీ రాంజీ' చట్టాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు. ఇవాళ హుజూర్ నగర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేట్ శక్తుల కోసం పేదల పొట్ట కొడుతోందని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టంపై అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు.