గూడూరులో ఈనెల 26 జాబ్ మేళా

TPT: గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ నెల 26న గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.