కోడిపందాల శిబిరాలపై పోలీసుల విస్తృత దాడులు

ELR: నూజివీడు మండలంలో గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై జ్యోతి బసు ఆదివారం తెలిపారు. మండలంలోని సుంకొల్లులో 8 మందిని అదుపులోకి తీసుకొని, 9150 రూపాయల నగదు, 2 కోడిపుంజులు, కత్తులు, యనమదలలో ఏడు గురుని అదుపులోకి తీసుకొని, 6750 రూపాయల నగదు, 2 కోడిపుంజులు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.