చంద్రబాబుకు జగన్ అంటే భయం: మాజీ ఎమ్మెల్యే

NLR: జగన్ పర్యటనను అడ్డగించేందుకు చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. ప్రజలను బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు, మహిళలపైనా లాఠీచార్జ్ చేశారని విమర్శించారు. పోలీసులు ఇలా వ్యవహరించారంటే పసుపు చొక్కాలు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు జగన్ అంటే భయమని నల్లపురెడ్డి వ్యాఖ్యానించారు.