ఎంపీని కలిసిన పోలీస్ ఉన్నతాధికారులు

సత్యసాయి: హిందూపురం పట్టణ కేంద్రంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో గురువారం హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారధిని పట్టణ డిఎస్పీ, సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.