కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: AISB
KDP: బద్వేలు పట్టణంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో ఫీజు కట్టలేదనే కారణంతో ఒక విద్యార్థిని 4వ సెమిస్టర్ పరీక్షకు అనుమతించకపోవడాన్ని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థి భవిష్యత్తును పణంగా పెట్టేలా యాజమాన్యం వ్యవహరిస్తోందని, వెంటనే కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.