VIDEO: 'హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

VIDEO: 'హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

కోనసీమ: మామిడికుదురులో ఉన్న బాలుర హాస్టల్‌ను బుధవారం రాత్రి అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాలను రుచి చూశారు. విద్యార్థులకు అందిస్తున్న సేవలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.