పనస చెట్టుకు 100 కాయలు చూశారా..?

పనస చెట్టుకు 100 కాయలు చూశారా..?

SKLM: పనస చెట్టుకు ఒకే సారి 100 కాయలు కాయడం ఎక్కడైనా చూశారా? వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గురుకుల పాఠశాలలోని పనస చెట్టుకు 10 కాదు 20 కాదు.. ఎకంగా 100 కాయలు కాయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ ఈశ్వరరావు మాట్లాడుతూ.. రోజూ నీటితో పాటు సేంద్రియ వ్యర్థాలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ కాయల తొనలను విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.