మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పట్టణంలో టీయూఎఫ్ఎడీసీ కింద మంజూరైన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, మార్చి 31 నాటికి ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను వంటి అన్ని పన్నులను 100% వసూలు చేయాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలన్నారు.