ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

కడప: ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌ను గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారి సమస్యలు విని పరిష్కార మార్గాలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్, సబ్ ఇన్‌స్పెక్టర్ శివ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.