జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NLG: జిల్లా ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసియు, సర్జికల్ వార్డు, మెడికల్ వార్డ్, రేడియాలజీ, తదితర విభాగాలను తనిఖీ చేసి డాక్టర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.