హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం
టీమిండియాకు తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. జైపూర్‌లోని నాహర్‌గఢ్ కోటలో ఉన్న వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 2026 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో సచిన్, ధోనీ, కోహ్లీ విగ్రహాలు ఉన్నాయి.