ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష: ప్రిన్సిపాల్

ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష: ప్రిన్సిపాల్

KMR: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు. ఆరవ తరగతి ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.