టీమిండియా ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయాం: అఫ్రిది
భారత్‌లో క్రికెట్‌కి ఉన్న ఆదరణ, జట్టుకు ఉన్న మద్దతుపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. 'భారత్‌తో మొహలీలో 2011 WC సెమీస్‌లో మాకు శుభారంభం లభించడంతో గెలిచేస్తాం అనుకున్నాం. కానీ తొలి వికెట్ పడినప్పటి నుంచి ప్రతి బంతికి అభిమానులు చేసే శబ్దంతో వణికిపోయాం. వారి నినాదాలు, హర్షధ్వానాలతో ఒత్తిడికి లోనయ్యాం' అని చెప్పుకొచ్చాడు.