'సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదంచేయండి'

ప్రకాశం: ఒంగోలులో ఈనెల 20 నుంచి 25 వరకు జరగనున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పెద్ద మస్తాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చంద్రశేఖరపురంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒంగోలులో రాష్ట్ర మహాసభల ను మొట్టమొదటిసారిగా నిర్వహించటం జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.