ఏప్రిల్ లో జరిగే SA-2 పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి

నెల్లూరు: ఏప్రిల్ లో జరిగే SA-2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధంగా ఉండాలని ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ తెలిపారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పాఠశాలలో రాజకీయ నాయకుల ఫోటోలు కనపడకుండా చూడాలన్నారు.