VIDEO: హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
SRD: ఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీ భక్త మార్కండేయ ఆలయం పరిసరాల్లో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లను సోమవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. స్థానిక అర్చకులు కృష్ణ శర్మ కొత్త లైట్ల బాక్స్‌కు పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం బాధ్యులు చైర్మన్‌కు సత్కరించారు.