డుంబ్రిగూడలో గ్యాస్ కొరత..!
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో వంట గ్యాస్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయడానికి మండల వాసులు ఆదివారం క్యూ కట్టారు. ఉదయం ఐదు గంటల నుంచే భారత్ గ్యాస్ వ్యాన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా ఆలస్యం కావడంతో మహిళలు, వృద్ధులు కూడా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.