ఆగని కన్నీటి కెరటం
ఈరోజు ఆకాశం కూడా మూగబోయింది. బస్సు ప్రమాదంలో కంకర కింద 20 మంది అమాయక జీవితాలు నలిగిపోయాయి. మొన్న కర్నూలు బస్సు దహనం, కాశీబుగ్గ తొక్కిసలాటలో ఎంతో మంది జీవితాలు ఛిద్రం అయ్యాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? డ్రైవర్ల అతి వేగమా? భద్రతా లోపమా? అధికారుల నిర్లక్ష్యమా? లేక దురదృష్టమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే లోపే, ఇంకొక విషాదం జరగకూడదని ఆ దేవుణ్ని వేడుకుందాం.