మణుగూరులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
BDK: మణుగూరు ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. డ్రైవర్లు, కండక్టర్లు విధులను బహిష్కరించడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.