మంత్రి తుమ్మల ఇలాకాలో ఎవరు గెలిచారంటే..!
BDK: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్ ఫలితాలు ఆత్యంత ఉత్కంఠగా సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెచ్చు ఈదప్ప తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 350 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో సొంత గ్రామంలో తుమ్మల, జారే తమ పట్టు నిలుపుకున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు.