'యూరియా కొరత రాకుండా చర్యలు'
PDPL: రాబోయే సీజన్లో యూరియా కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గతంలో రైతులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా, సరఫరా వ్యవస్థలను సకాలంలో సిద్ధం చేయాలన్నారు. ఆర్ఎఫ్సీఎల్ పూర్తి సామర్థ్యంతో నడిస్తేనే తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో అవరోధం ఉండదని ఆయన పేర్కొన్నారు.