VIDEO: లింగాపూర్‌లో ఇఫ్తార్ విందు

VIDEO: లింగాపూర్‌లో ఇఫ్తార్ విందు

SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం రంజాన్ ఇఫ్తార్ విందును గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్థానిక జుమా మసీదు వద్ద ముస్లింలు (మగ్రిబ్) సాయంకాల ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ ప్రతినిధి అన్నలదేశి హనుమండ్లు, గ్రామ నాయకులు ముస్లింలకు పండ్లు ఫలాలు అందజేయగా వారు ఉపవాస దీక్షను విరమించారు.