VIDEO: వ్యవసాయంపై మక్కువ చాటుకున్న ఎమ్మెల్యే
BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యవసాయం పై మక్కువతో తీరిక సమయంలో తన వ్యవసాయ క్షేత్రంలో పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టిన తను వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నట్లు వెల్లడించారు. ఆడంబరాలకు అట్టహాసాలకు పోకుండా ఎవరి పని వారు చేసుకోవడం మంచిదని, తద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలిపారు.