VIDEO: "జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలి"

WGL: ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండాను ఎగరవేసి మాట్లాడారు. ఆగస్టు 15న, జనవరి 26న మాత్రమే కాకుండా 365 రోజులు ఆ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి, తాము దేశం పట్ల బాధ్యతతో ఉండాలని, క్రమశిక్షణ అలవర్చుకోవాలని కోరారు.