ఉ‘సిరి'కి భారీ డిమాండ్

ఉ‘సిరి'కి భారీ డిమాండ్

VKB: పరిగి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పరిగి మార్కెట్‌లో 250గ్రా. ఉసిరి రూ.30-50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు.