VIDEO: కలెక్టరేట్‌లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన

కోనసీమ: జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో డీపీఎం సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. రైతులు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, బియ్యం, ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు వెంకటరమణ, వ్యవసాయ నాయకులు పాల్గొన్నారు.