కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు షురూ

కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు షురూ

HNK: కాజీపేట హజరత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. క్రీస్తుశకం 1865లో సఫర్ 26న హజరత్ భగవంతునిలో లీనమైన దినాన దర్గాను నిర్మించి ఉర్సు ఉత్సవాలను ఆరంభించి నేటికి కొనసాగిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు తెలిపారు. హిందూ, ముస్లిం సమైక్యతకు ఈ దర్గా ప్రతీకగా ఉంటుంది. అర్థరాత్రి గంధం (సందల్) వేడుక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది.