నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారు: కలెక్టర్

నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారు: కలెక్టర్

తిరుపతి: నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి నిర్వహించిన ర్యాలిని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లితండ్రులు వారి పిల్లలను అటు చదువులోనూ.. ఇటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు.