రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మెరకముడిదాం మండలం పూతికవలసలో తారు రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సాతాంవలస గ్రామం నుంచి చినపూతికవలస వరకు రూ. 1.50 లక్షల నిధులతో తారు రోడ్డు పనులు జరగనున్నాయన్నారు.