నది పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దు: సీఐ
NLR: తుఫాన్ నేపథ్యంలో పెన్నా నది పరివాహక గ్రామాల ప్రజలను తమ సిబ్బంది అప్రమత్తం చేశారని ఆత్మకూరు సీఐ గంగాధర్ చెప్పారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లోని ప్రజలు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నది, వాగుల వద్దకు ఎవరూ వెళ్ల వద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఈ మూడు రోజులు ప్రజలు బయటకి రావద్దని పేర్కొన్నారు.