సాఫ్ట్ బాల్ క్రీడాకారుడిని సత్కారించిన ఎమ్మెల్యే
VZM: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన జి.నానిబాబును గురువారం ఎమ్మెల్యే బేబినాయన అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడాలపై ఆసక్తి చూపితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే చదువుతో పాటు క్రీడాలలో రాణించాలని సూచించారు.