నాటువైద్యం వికటించి విద్యార్థిని మృతి
GNTR: మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. బాలిక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో స్థానికుల సలహాతో 'కొండపిండి ఆకు' తినిపించగా, కడుపునొప్పి తీవ్రమైంది. దీంతో గుంటూరు GGHకు తరలించగా, చికిత్స పొందుతూ బాలిక గురువారం మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.