'అర్హత గల రైతులందరికీ సంక్షేమ పథకాలు'
SKLM: అర్హత గల రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం హిరమండలం మండలం చొల్లంగి గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం, సబ్సిడీ పథకాలు అందాయా లేదా అని ఇంటింటికి వెళ్లి రైతులను అడిగారు.