VIDEO: ‘చిలకపాలెంలో అక్రమ మైనింగ్ దందా’
SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీ నారాయణపురం రెవిన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ చేపడుతున్నారని సీఐటీయు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు ఇవాళ అన్నారు. బాంబులు మోత మోగించి, చెట్లను నరికివేసి అక్రమ మైనింగ్ దందా పగలు, రాత్రి చేపడుతున్నారన్నారు. పరిసర ప్రాంతాలలో IIIT, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.