'పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'
BDK: భద్రాచలం ఎల్లప్పుడు పచ్చదనంగా ఉండేలా కృషి చేస్తున్న గ్రీన్ భద్రాద్రి కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అభినందనలు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో తెల్ల వెంకటరావు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.