క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
VZM: గజపతినగరం మండలంలోని ములకలడాం గ్రామంలో యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటును శనివారం గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు, గ్రామ సర్పంచ్ బొడ్డు రాంబాబులు ప్రారంభించారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ ఆసక్తి చూపాలన్నారు. ఇందులో ఎంపీటీసీ బైరెడ్డి లావణ్య, మాజీ విఆర్వో బైరెడ్డి నారాయణ, కానిస్టేబుల్ బైరెడ్డి సత్యనారాయణ, నాయుడు, అల్లు రమణ పాల్గొన్నారు.