'ఇంటి పన్ను ఈ నెల 31లోపు చెల్లించాలి'

'ఇంటి పన్ను ఈ నెల 31లోపు చెల్లించాలి'

గుంటూరు: చేబ్రోలు మండలంలో ఇంటి పన్ను బకాయిలను ఈ నెల 31లోపు తప్పనిసరిగా చెల్లించాలని ఎంపీడీవో ఊహారాణి సూచించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని చెప్పారు. వసూళ్లకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.