బీడీ వర్కర్స్ విద్యార్థుల ఉపకార వేతనాలపై అవగాహన

బీడీ వర్కర్స్ విద్యార్థుల ఉపకార వేతనాలపై అవగాహన

SRCL: చందుర్తి మండలంలోని బీడీ వర్కర్స్ విద్యార్థుల ఉపకార వేతనాలపై అవగాహనాతో పాటు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో రాధా మంగళవారం తెలిపారు. మండల కేంద్రంలో రైతు వేదికలో బుధవారం ఉదయం 11గంటలకు ఉపకార వేతనాలపై అవగాహనతో పాటు, దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని బీడీ వర్కర్స్, టేకే దార్లు డాక్యుమెంట్స్‌తో హాజరుకావాలని పేర్కొన్నారు.