వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం

KNR: చొప్పదండి మండలం ఆర్నకొండ శివారు వ్యవసాయ బావిలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు ఉండి ఒంటిపై బిస్కెట్ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసినవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని SI నరేష్ రెడ్డి కోరారు.