కలెక్టర్‌కు ఎమ్మెల్యే బీఎల్ఆర్ కృతజ్ఞతలు

NLG: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్లకు ఎమ్మెల్యే బీఎల్ఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాల కల్పనకై వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. నిర్వాసితులకు అండగా నిలిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు తెలిపారు.