వందే భారత్ పొడిగింపు.. డిప్యూటీ స్పీకర్ కృతజ్ఞతలు
W.G: చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించినందుకు ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పొడిగింపు గోదావరి జిల్లాల వాసులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కీలక నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.