ప్రత్యేక పుష్పాల అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు

ప్రత్యేక పుష్పాల అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు శ్రావణ సోమవారం ప్రత్యేక పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చాడు.ఉదయాన్నే పురోహితులు రామకృష్ణ స్వామి వారికి పంచామృత, ఏకబిల రుద్రాభిషేకం చేపట్టి స్వామి మూలవిరాట్‌పై గులాబీ పూలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో స్వామి వారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సూచించారు.