ఫుట్‌బాల్ అంశంపై విశ్వేశ్వర్ రెడ్డి యూటర్న్

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫుట్‌బాల్ అంశంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. 'కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడుకోవాలో చెప్పేందుకే ఇలా తీసుకువచ్చాను. తెలంగాణలో BRS ఉనికి లేదు, కాంగ్రెస్‌తోనే మాకు పోటీ' అని ఇవాళ స్పష్టం చేశారు. కాగా, పార్టీ వ్యవహారాలపై అసహనం వ్యక్తంచేస్తూ చంద్రశేఖర్‌కు నిన్న ఫుట్‌బాల్ ఇచ్చిన విషయం తెలిసిందే.