అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి సాధించాం అన్నారు.