VIDEO: కట్ట తెగితే భారీ ప్రమాదం

TG: కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బీబీపేట పెద్ద చెరువు వరద నీటితో ఫుల్ అయిపోయింది. చెరువుకట్ట వద్ద ఎల్లమ్మ గుడి సైతం మునిగిపోయింది. కట్టపైకి వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు కట్ట ఏ మాత్రం తెగినా మూడు ఊర్లకు భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తం కావాలని, కట్ట తెగకముందే పునరావాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.