ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ
SKLM: పోలాకి మండలం కత్తిరివానిపేట గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారికి తెలిపి, సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.