మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: వల్లభ్ రెడ్డి
NLG: నిడమానూరు (మం) వూట్కూరు గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన రాష్ట్ర కార్యదర్శి యడవెల్లి వల్లభ్ రెడ్డి గారు హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వల్లభ్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్నిపెంపొందించడానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు.